Kollapur: కొల్లాపూర్ బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ మహిళ మంత్రులు
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణ ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు
- By Praveen Aluthuru Published Date - 12:05 AM, Sun - 23 June 24

Kollapur: కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణ ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. బాధితురాలు ఈశ్వరమ్మకు పార్టీ తరపున లక్షా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆమెకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వెంటనే మహిళా వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Also Read: Uppal: ప్రేమికులను వేధిస్తున్న ముఠా అరెస్ట్