2 Lakh Crores Due : ఆర్థిక సంక్షోభానికి సిగ్నల్.. 2 లక్షల కోట్లు దాటిన ఆ బకాయిలు
2 Lakh Crores Due : దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి అద్దంపట్టే ఒక డేంజరస్ సిగ్నల్ బయటపడింది..
- Author : Pasha
Date : 26-06-2023 - 1:46 IST
Published By : Hashtagu Telugu Desk
2 Lakh Crores Due : దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి అద్దంపట్టే ఒక డేంజరస్ సిగ్నల్ బయటపడింది..
తొలిసారిగా క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ.2 లక్షల కోట్లు దాటాయి..
2022 ఏప్రిల్ తో పోలిస్తే.. 2023 ఏప్రిల్ లో క్రెడిట్ కార్డ్ బకాయిలు 30 శాతం పెరిగాయి..
మరో విషయం తెలుసా.. ?
బ్యాంకులు ఇచ్చిన లోన్స్ కంటే రెట్టింపు రేంజ్ లో క్రెడిట్ కార్డ్ బకాయిలు పెరిగాయి..
Also read : Worlds Tallest Tree : స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన చెట్టు.. ఎక్కడ ?
బ్యాంకులు చాలా రకాల లోన్స్ ను ఇస్తుంటాయి. వాటిలో గోల్డ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్ పై లోన్స్, క్రెడిట్ కార్డు లోన్స్, వెహికల్ లోన్స్, హౌజింగ్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ పర్సనల్ లోన్స్ కిందికే వస్తాయి. వీటిలో మొదటి ప్లేస్ లో హౌసింగ్ లోన్స్ (14. 1 %), రెండో ప్లేస్ లో వెహికల్ లోన్స్ (3. 7%), మూడో ప్లేస్ లో క్రెడిట్ కార్డు బకాయిలు (1.4%) ఉన్నాయి. RBI ప్రకారం.. 2023 ఏప్రిల్ నాటికి క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ. 2,00,258 కోట్లకు(2 Lakh Crores Due) చేరాయి. 2008 లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ టైంలో క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా 1. 2% ఉంది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో క్రెడిట్ కార్డ్ బకాయిలు పేరుకుపోతుండటం ఆందోళన రేకెత్తించే అంశమే.