Food Poisoning : కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత
కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. గత వారం డిసెంబర్ 29 కేరళలో బాప్టిజం వేడుకకు హాజరైన 100 మంది
- By Prasad Published Date - 09:52 AM, Mon - 2 January 23

కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. గత వారం డిసెంబర్ 29 కేరళలో బాప్టిజం వేడుకకు హాజరైన 100 మంది వ్యక్తులు ఫుడ్ పాయిజనింగ్‌కి గురైయ్యారు.ఈ ఘటనపై క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈఘటనపై విచారణకు ఆదేశించారు. గత వారం పతనంతిట్ట జిల్లా కీజ్‌వాయిపూర్ గ్రామంలో బాప్టిజం వేడుక జరిగింది. చాలా మంది ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన 100 మందికి పైగా ఫుడ్ పాయిజన్‌తో బాధపడి ఆ ప్రాంతంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీజ్‌వాయిపూర్ పోలీసులు క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై ఐపీసీ సెక్షన్ 268, 272, 269 కింద కేసు నమోదు చేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా సోమవారం 100 మందికి ఫుడ్ పాయిజనింగ్‌కు గురైనట్లు నివేదికలు వెలువడటంతో విచారణకు ఆదేశించారు.