HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Flood Fears Back As Yamuna Continues To Overflow After Fresh Rain Spell In Delhi

Delhi: శాంతించిన యమునా నది.. అయినా ప్రజల్లో వీడని భయం?

ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు క

  • Author : Anshu Date : 16-07-2023 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi
Delhi

ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు నదులు చెరువులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితులు ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఢిల్లీని ముంచెత్తిన వరద ప్రవాహం శనివారం కాస్త నెమ్మదించింది. తాజాగా మరోసారి భారీ వర్షం కురవడంతో మరొకసారి ఢిల్లీని వరదలు ముంచెత్తుతాయని ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి యమునా నది శాంతించినప్పటికీ ఈ వరదల కారణంగా మరొకసారి వరదలు పోటెత్తుతాయేమో అని ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయానికి యమునా నీటి మట్టం 205.98 మీటర్లకు తగ్గింది. వాస్తవానికి ప్రమాదకర నీటి మట్టమైన 205.33 కంటే ఇది ఎక్కువే. మళ్లీ వర్షాలు లేకపోతే నేటి రాత్రికి ఇది 205.75కు తగ్గవచ్చని భావిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే దిల్లీ పరిస్థితిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాతో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు. ఈ విషయాన్ని సక్సేనా ట్విటర్‌లో వెల్లడించారు.

మరోవైపు యుమునా బ్యారేజీలో మొరాయిస్తున్న ఐదు గేట్లను తెరిచేందుకు యత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. యమున ప్రవాహం తగ్గిందని త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని ఆయన వెల్లడించారు. చాలా మంది ఢిల్లీ వాసులు తిరిగి వారి గృహాలకు చేరుకుంటున్నారు. మరోవైపు యమునా తీరాన ఉన్న మెట్రోస్టేషన్‌ను తెరిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఈ వరదల బీభత్సాల కారణంగా ఇప్పటికే దాదాపు పది మంది మరణించారు. నొయిడాలోని దనాకౌర్‌ ప్రాంతంలో ఇద్దరు యువకులు యమునా ప్రవాహంలో కొట్టుకుపోయారు. యూపీలోని గౌతమ్‌ బుద్ధానగర్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యుమున ప్రవాహాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదల కారణంగా రూ.8 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • floods in north india
  • full rains
  • india
  • overflow

Related News

Tahawwur Rana

ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.

  • Trump's 10% Global Tariffs

    Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

  • Delhi Alert

    Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Latest News

  • Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

  • Prabhas : నిర్మాతలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభాస్!

  • TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..ప్రభుత్వానికి కార్మికులు డెడ్ లైన్ !!

  • Firing : తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని వధువుని కాల్చి చంపిన ప్రేమికుడు

  • Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd