Amaravati Farmers : రేపల్లెలో ఫ్లెక్సీల కలకలం.. అమరావతి రైతులకు వ్యతిరేకంగా..?
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అమరావతి టూ అరసవల్లి
- By Prasad Published Date - 07:31 AM, Sat - 17 September 22

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర శనివారం బాపట్ల జిల్లా రేపల్లెలో జరగనుంది. అయితే రేపల్లెలో రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనడం స్వార్థం.. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు.. గ్రాఫిక్స్ పాలన వద్దు, సంక్షేమ పాలన ముద్దు.. ఇలాంటి నినాదాలతో పోస్టర్లు వెలిశాయి. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అనే నినాదంతో వెలిసిన ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు దారితీసే విధంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.