Durg-Puri Express: బాలాసోర్ రైలు ప్రమాదం మరవకముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. ఏసీ కోచ్ లో మంటలు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మరవకముందే మరో రైలులో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాలో దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్ (Durg-Puri Express)లోని ఏసీ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
- By Gopichand Published Date - 09:33 AM, Fri - 9 June 23

Durg-Puri Express: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మరవకముందే మరో రైలులో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాలో దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్ (Durg-Puri Express)లోని ఏసీ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖరియార్ రోడ్ స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు బి-3 కోచ్ నుండి పొగలు వచ్చినట్లు రైల్వే శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు నుంచి బయటకు వచ్చారు.
Odisha | Brake pads of the AC coach of Puri-Durg Express caught fire near Khariar Road in Nuapada district due to certain glitches in the brake shoe on June 8.
“In B3 coach of 18426 at Khariar Road station arrival at 22.07 hrs (10:07 pm). The brakes were not released after ACP…
— ANI (@ANI) June 9, 2023
రాపిడి, బ్రేక్‌లు అసంపూర్తిగా విడుదల చేయడం వల్ల బ్రేక్ ప్యాడ్‌లు మంటలకు గురయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే మంటలు బ్రేక్ ప్యాడ్‌లకే పరిమితమయ్యాయి. ఎటువంటి నష్టం జరగలేదు. గంటలోపు లోపాన్ని సరిచేసి రాత్రి 11 గంటల ప్రాంతంలో రైలును పంపించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవల బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొనడంతో భారీ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 288 మంది మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో రైల్వే భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.