Fire Accident : పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు
అనకాపల్లి పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది.
- Author : Prasad
Date : 08-08-2022 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
అనకాపల్లి పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.