Delhi Fire news: ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం (Fire breaks) సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ పార్ట్-1 ఏరియాలోని ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్లో శనివారం ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire breaks) ఐదు ఫైరింజన్లతో
- By Gopichand Published Date - 11:36 AM, Sat - 17 December 22
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం (Fire breaks) సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ పార్ట్-1 ఏరియాలోని ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్లో శనివారం ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire breaks) ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Also Read: Delhi : ఢిల్లీ ఫతేపూర్ బేరీలో అగ్నిప్రమాదం..ఐదుగురికి గాయాలు
శనివారం ఉదయం 9.08 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు కాల్‌పై సమాచారం అందిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అనంతరం ఐదు వాహనాలను అక్కడికక్కడే పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆ శాఖ తెలిపింది. ఆసుపత్రిలోని కార్యాలయం, అండర్‌గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయని, ఉదయం 9.50 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నామన్నారు.
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.