Fire Accident : క్లాత్స్ గోదాములో అగ్నిప్రమాదం.. రెండుకోట్ల మేర ఆస్తి నష్టం
విశాఖపట్నంలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుస్తుల గోదాములో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది
- By Prasad Published Date - 01:27 PM, Mon - 18 July 22

ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నంలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుస్తుల గోదాములో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయని దువ్వాడ పోలీసులు తెలిపారు. సుమారు రెండు కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లిందని తెలిపారు.