Hyderabad: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 10:40 PM, Wed - 7 February 24
Hyderabad: ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆస్థి నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.స్విచ్ బోర్డు ప్యానెల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మొదటి అంతస్తు నుండి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. దీని కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు మరియు శిశువులు ఉండే ఆవరణను ఖాళీ చేయవలసి వచ్చింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న చాలా మంది రోగులను సరైన సమయంలో తరలించినట్లు ఆసుపత్రి అధికారులు నిర్వహించారు.
Also Read: Juice: నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే?