Fire Accident : మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చేలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటా నగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని రాఘవేంద్ర
- Author : Prasad
Date : 05-07-2023 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటా నగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని రాఘవేంద్ర ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములో సర్క్యూట్ ఫెయిల్యూర్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టాటా నగర్ నుండి కేవలం 100 అడుగుల దూరంలో ఉన్న బృందావన్ కాలనీకి దట్టమైన పొగ వ్యాపించడంతో ఈ సంఘటన సమీపంలోని నివాసితులు ఇబ్బందులకు గురైయ్యారు. టాటా నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు అక్రమంగా గోదాములు నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఉల్లంఘనలపై స్పందించిన GHMC అధికారులు గతంలో ఈ ప్రాంతంలోని పలు గోదాములను మూసివేశారు. ఈ ప్రమాదంపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.