Fire Accident : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. టింబర్ డిపోలో చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంఎం ఏరియాలో కలపను ఉంచిన టింబర్ డిపోలో భారీ
- Author : Prasad
Date : 13-03-2023 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంఎం ఏరియాలో కలపను ఉంచిన టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను వెంటనే గుర్తించలేకపోయారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వారు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు మంటలు చెలరేగాయి. గిడ్డంగిలో భారీగా కలప నిల్వ ఉందని ఫైర్ అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు కనీసం 7-8 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.