Rape Case: నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కంపిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 14-09-2023 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
Rape Case: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కంపిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పొలంలో పడేశారు. వీధి కుక్కలు బాలిక మృతదేహాన్ని గుర్తించాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మైనర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ళ చిన్నారి కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెంది చుట్టుప్రక్కల వెతికారు. చివరికి బాలిక ఇంటికి కొంత దూరంలోని పొలంలో మృతదేహం లభ్యమైంది. బాలిక కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా కూతురు రక్తపుమడుగులో పడి ఉంది. మృతదేహాన్నీ వీధికుక్కలు పీక్కుతిన్నాయి. ప్రస్తుతం కేసుని విచారిస్తున్నామని స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు.
Also Read: New Smartphone: మార్కెట్లోకి హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?