Karimnagar : కేటీఆర్ కారుపై చెప్పు విసిరే యత్నం చేసిన రైతు సంఘం నేత..!!
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు శుక్రవారం అనూహ్య ఘటన ఎదురైంది. రైతు సంఘం నేత నుంచి నిరసన ఎదురైంది. కేటీఆర్ కారుపై చెప్పు విసిరేందుకు రైతు సంఘం నేత ప్రయత్నం చేశాడు.
- Author : hashtagu
Date : 10-06-2022 - 7:08 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు శుక్రవారం అనూహ్య ఘటన ఎదురైంది. రైతు సంఘం నేత నుంచి నిరసన ఎదురైంది. కేటీఆర్ కారుపై చెప్పు విసిరేందుకు రైతు సంఘం నేత ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు…కేటీఆర్ కారుకు దూరంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. పలు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు మంత్రి కేటీఆర్ . జిల్లాలోని మెట్ పల్లికి వెళ్లిన ఆయన…రైతు సంఘం నేతల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయన్న సమాచారంతో పోలీసులు పలువురు నేతలను ముందుగానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిలో నారయణ రెడ్డి అనే రైతు సంఘం నేత కూడా ఉన్నారు.
సాయంత్రం మెట్ పల్లి చేరుకున్న కేటీఆర్ కాన్వాయ్ రైతు సంఘం నేతలు ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తోంది. ఈ విషయాన్ని గమనించిన నారాయణ రెడ్డి…పోలీస్ స్టేషన్ గేటు దగ్గరకు వచ్చి కేటీఆర్ కారుపై చెప్పు విసిరేందుకు యత్నించాడు. పోలీస్ స్టేషన్ ఆవరణ పెద్దగా ఉండటంతో నారాయణ రెడ్డి గేటు చేరుకోకముందే పోలీసులు అలర్ట్ అయ్యారు. నారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.