4 Burned To Death : పాత కక్షలతో నలుగురి సజీవ దహనం..మృతుల్లో 6 నెలల శిశువు
4 Burned To Death : రాజస్థాన్ నుంచి ఒక హృదయ విదారకమైన వార్త బయటకు వచ్చింది. జోధ్‌పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
- Author : Pasha
Date : 19-07-2023 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
4 Burned To Death : రాజస్థాన్ నుంచి ఒక హృదయ విదారకమైన వార్త బయటకు వచ్చింది.
జోధ్‌పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు.
పాత కక్షల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించారు.
ఈ అమానుష ఘటనలో సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయిన వారిలో 6 నెలల చిన్నారి కూడా ఉంది.
Also read : Delhi Secret : చంద్రబాబుకు NDA ఆహ్వానం లేకపోవడం వెనుక కారణమిదే.!
జోధ్‌పూర్ జిల్లా ఒసిన్యా తహసీల్‌లోని చౌరాయ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సజీవ దహనం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో హంతకులు ముందుగా.. తాము టార్గెట్ గా ఎంచుకున్న కుటుంబ సభ్యులను మంగళవారం రాత్రి నిద్ర లేపారు. వారిని మర్డర్ చేసిన అనంతరం ఇంటి ప్రాంగణానికి ఈడ్చుకెళ్లి మంచాలకు కట్టేసి నిప్పు పెట్టారని పోలీసులు అంటున్నారు. తెల్లవారుజాము టైంలో బాధితుల ఇంటి నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు ఇళ్ల వారికి డౌట్ వచ్చింది.
Also read : NTR’s Gift: రామ్ చరణ్ కూతురు క్లీంకారకు ఎన్టీఆర్ స్పెషల్ గిప్ట్!
ఆ ఇంటి దగ్గరికి వెళ్లిన స్థానికులకు.. ఆవరణలో నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు (4 Burned To Death) పూర్తిగా దగ్ధమైన స్థితిలో కనిపించాయి. సజీవ దహనమైన వారిలో 6 నెలల శిశువు కూడా ఉంది. శిశువు మృతదేహం పూర్తిగా కాలిపోగా, మిగతా ముగ్గురు పెద్దల మృతదేహాలు సగం కాలిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న జోధ్ పూర్ రూరల్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ యాదవ్, పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలం నుంచి క్లూస్ సేకరించారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also read : Telangana Congress : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్.. సీనియర్ నేతకు కీలక బాధ్యతలు