షారూక్ ఖాన్ కు ట్విట్టర్ సీఈవో మద్ధతు? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత?
షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ట్వీట్ల వర్షాన్ని కురిపించింది. మరో వర్గం అరెస్ట్ ను సమర్థిస్తూ ట్వీట్ల వరదను పారించింది. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ హాట్ టాపిక్ అయింది.
- By Hashtag U Published Date - 02:05 PM, Sat - 16 October 21

షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ట్వీట్ల వర్షాన్ని కురిపించింది. మరో వర్గం అరెస్ట్ ను సమర్థిస్తూ ట్వీట్ల వరదను పారించింది. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ హాట్ టాపిక్ అయింది.
ఇరు వర్గాలు పోస్ట్ చేసిన వాటిలో రెండు ఫోటోలు వైరల్ అయ్యాయి. ట్విటర్ సీఈవో డార్సీ మన్నాట్ హోటల్ లో ఖాన్ తో ఉండడాన్ని బాయ్ కాట్ చేయాలని ఒక వర్గం ఫోటో వైరల్ అయింది. షారూక్ ఖాన్, డార్సీ మెడిటేషన్ చేస్తూ ఖాన్ ఇంటిలో ఉన్న ఫోటో వైరల్ అయిన రెండో ఫోటో. ఖాన్ కు మద్దతు ఇస్తూ డార్సీ రాసినట్టు ఇమేజ్ లను సూపర్ ఇమేజ్ చేస్తూ పెట్టారు.
Hashtag U ఫ్యాక్ట్ చెక్ ఈ పోస్ట్ ల నిజానిజాలను నిగ్గుతేల్చింది. డార్సీ ట్వీట్ మరిము అతని ఫోటో రెండూ పాతవని గుర్తించింది. ఆర్యన్ ఖాను అరెస్ట్ కు సంబంధించిన ట్వీట్లు కావని తేల్చింది. వాస్తవంగా 2018 నవంబర్ 14న ముంబాయ్ మన్నాట్ హోటల్ లో ఖాన్ ఉన్నప్పుడు డార్స్ విజిట్ చేశాడు. ఆ సందర్భంగా తీసిన ఫోటో అప్పట్లో ఖాన్ ట్వీట్ చేశాడు.
@iamsrk knock knock pic.twitter.com/1srdqFiy3O
— jack (@jack) November 14, 2018
దాన్ని ఇప్పుడు సూపర్ ఇంపోజ్ చేసి ట్వీట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు, ట్వీట్ లు డార్స్ ఇప్పుడు చేసినవి కాదని తేలింది.