Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
- By HashtagU Desk Published Date - 10:06 AM, Sat - 12 February 22

కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో హైకోర్టులో వచ్చే సోమవారం హిజాబ్ వివాదం పై విచారణ జరగనుందని సమాచారం. ఇక సోమవారం నుంచి కళాశాలలు తెరవాలని హైకోర్టు ఆదేశిస్తూ, విద్యాసంస్థల్లో యూనిఫారంను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో హిజాబ్, కాషాయం లేకుండా విద్యార్ధులు కళాశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుని, విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, విద్యాసంస్థలకు ఈ నెల 16 వరకు సెలవులను పొడిగించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపు న్యాయస్థానాల నుంచి తీర్పు వెలువడే అవకాశముంది. కాగా హిజాబ్ వివాదంపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.