Japan PM: జపాన్ ప్రధానిపై దాడి … తొమ్మిది నెలల క్రితమే ప్రధాని హత్య
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యూమియో ప్రసంగిస్తుండగా స్మోక్ బాంబ్ దాడి జరిగింది
- By Praveen Aluthuru Published Date - 03:08 PM, Sat - 15 April 23
Japan PM: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యూమియోలో ప్రసంగిస్తుండగా స్మోక్ బాంబ్ దాడి జరిగింది. ప్రధానిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలం నుంచి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించే ముందు ఈ దాడికి యత్నించారు దుండగులు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పైప్ బాంబు ప్రధాని వద్దకు చేరకముందే ప్రధానిని సురక్షితంగా అక్కడినుండి తరలించారు. ఇది జరిగిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో జనం పరుగులు తీశారు. ఈ దాడిలో ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదని భద్రతా బలగాలు ప్రకటించాయి.
పోలీసులు విచారణ ప్రారంభించారు:
ప్రధానమంత్రి ఫుమియో కిషిదాను సురక్షితంగా రక్షించడంతో పాటు, దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొమ్మిది నెలల క్రితమే మాజీ ప్రధాని హత్యకు గురయ్యారు:
జపాన్ (Japan ) మాజీ ప్రధాని షింజో అబే హత్య జరిగిన తొమ్మిది నెలలకే ఫ్యూమియో కిషిడాపై దాడి జరిగింది. మాజీ ప్రధాని షింజో అబేపై 2022 జూలైలో తుపాకీతో దాడి చేశారు. ఈ ఘటనలో మాజీ ప్రధాని అక్కడిక్కడే మృతి చెందారు.
BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh
— BNO News Live (@BNODesk) April 15, 2023
Read More: Rashmika Kiss: అభిమానులకు ముద్దు పెట్టిన రష్మిక.. రియాక్ట్ అయిన నెటిజన్స్!
Related News
Japan Vs Russia : ఖబడ్దార్ రష్యా.. అణుబాంబు వార్నింగ్స్ ఆపేయ్
Japan Vs Russia : ఇవాళ (ఆగస్టు 6) హిరోషిమా డే.. 1945 ఆగస్టు 6న జపాన్ లోని హిరోషిమా సిటీపై అమెరికా అణుబాంబుతో దాడికి తెగబడిన రోజును హిరోషిమా డేగా జపాన్ లో నిర్వహిస్తారు.