Rashmika Kiss: అభిమానులకు ముద్దు పెట్టిన రష్మిక.. రియాక్ట్ అయిన నెటిజన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- By Balu J Published Date - 01:32 PM, Sat - 15 April 23

సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కు ఫుల్ క్రేజ్ ఉంది. పార్టీలు, వెకేషన్, బీచ్ లు, తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఉంది. షూటింగ్స్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ఇష్టపడుతుంది. తాజాగా ఈ నేషనల్ క్రష్ షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అభిమానులను ముద్దు (Kissing) పెడుతున్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. “నాకు ఎలా పొడుచుకోవాలో తెలియదు కాబట్టి నేరుగా ముద్దుగా ఉంది” అనే క్యాప్షన్ ఇచ్చింది. రష్మిక షేర్ (Social Media) చేసిన ఫొటోకు ఒకవైపు ప్రశసంలు వస్తే, మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఆమె ముఖ వెంట్రుకలపై కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్ కు దిగారు నెటిజన్స్.
‘గడ్డం ఆతీ హే ఆప్కో యార్ దాడీ పర్ బాల్ హే మేడమ్ కే’ అని రాస్తే, ‘గడ్డం ఆ రహీ హెచ్ థోడి థోడి జావ్ కె పాస్’ అని కామెంట్ చేశారు. ఏదేమైనా రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీవల్లీగా ఫేమ్ అయిన రష్మిక (Rashmika Mandanna) గతంలో ఎన్నోసార్లు అభిమానులకు (Fans) ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది. నిత్యం అభిమానులతో టచ్ లో ఉండే ఈ బ్యూటీకి అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం రష్మిక రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’, నితిన్‌తో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన పేరులేని చిత్రం, అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప: ది రూల్’ చిత్రాలతో బిజీగా ఉంది.
Also Read: 3 Died: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 3 మృతి!