T Congress : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)
మాజీ పీసీసీ చీఫ్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) సొంతగూటికి చేరుతున్నారు. నేడు హైదరాబాద్‌లోని
- By Prasad Published Date - 08:23 AM, Sun - 26 March 23

మాజీ పీసీసీ చీఫ్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) సొంతగూటికి చేరుతున్నారు. నేడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. గతంలో ఆయన సుధీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్‌గా పని చేసిన ఆయన రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. అధిష్టానంపై ఉన్న అసంతృప్తితో ఆయన కొద్దికాలంగా బీఆర్ఎస్ నాయకత్వంతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.