Errabelli: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి
- By Balu J Published Date - 01:30 PM, Sun - 3 December 23
Errabelli: బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనను కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ఘోరంగా ఓడించారు. అయితే పాలకుర్తితో ఎర్రబెల్లిపై కొంత వ్యతిరేకత ఉండటం, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఎర్రబెల్లికి ఓటమికి కారణాలు అని తెలుస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి మాదిరిగానే తెలంగాణ మంత్రులు కొందరు ఓటమి దిశగా పయనిస్తున్నారు. హస్తం హవాతో బీఆర్ఎస్ నాయకులు తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.