Congress Govt : రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రబెల్లి సవాల్
Congress Govt : రేవంత్ (Revanth) నాయకత్వంలోని ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి
- By Sudheer Published Date - 03:38 PM, Sat - 12 April 25

తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమనే విధంగా బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం ప్రస్తుతం రూలింగ్ కాంగ్రెస్ పార్టీలో 32 మంది పోటీపడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే అంతమంది ఆశ పెట్టుకున్నా.. చివరికి నలుగురికే ఆ పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు. ఇది కచ్చితంగా రాజకీయ అస్తవ్యస్తతకు సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.
Bengal : మరోసారి బెంగాల్‌లో చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్
ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందా అనే విషయం తేలాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలంటూ ఎర్రబెల్లి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని చెబుతూ, ఎన్నికల వాయిదా వేయడంలో అర్థం లేదన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు, ఎవరెవరు కూర్చుంటారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అప్రకటన పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ (Revanth) నాయకత్వంలోని ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, పదవుల కోసం నేతల మధ్య పోటీ.. అన్ని అంశాలు ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.