Hyderabad : గణేష్ ఉత్సవాలపై అధికారులతో హైదరాబాద్ సీపీ సమీక్ష
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 మధ్య జరిగే గణేష్ ఉత్సవాలను సజావుగా నిర్వహించాలని నగర పోలీసు
- By Prasad Published Date - 10:40 PM, Thu - 18 August 22

హైదరాబాద్: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 మధ్య జరిగే గణేష్ ఉత్సవాలను సజావుగా నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా పోలీసు బృందాల మధ్య సమన్వయం అవసరమని సీవీ ఆనంద్ తెలిపారు.. హైదరాబాద్‌లోని గణేష్ మండపాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కోర్టు ఆదేశాలను పాటించాలని తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎస్‌ఆర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఊరేగింపు మార్గంలో రోడ్డు మరమ్మతు పనులు, ఇతర పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన క్రేన్‌ల సంఖ్య మరియు అదనపు ఉద్యోగుల గురించి ఆయన వివరించారు.