Twitter Video App : యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ వీడియో యాప్
Twitter Video App : ఎలాన్ మస్క్.. ఇన్నోవేషన్ కు చిరునామా. ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ను కొన్న తర్వాత దానిలో ఎన్నెన్ని మార్పులు చేశారో మనం చూశాం. ఆయన మరో సరికొత్త ప్రయోగాన్ని ట్విట్టర్ లో చేయబోతున్నారు
- Author : Pasha
Date : 18-06-2023 - 9:06 IST
Published By : Hashtagu Telugu Desk
Twitter Video App : ఎలాన్ మస్క్.. ఇన్నోవేషన్ కు చిరునామా
ఎలాన్ మస్క్.. పెట్టుకున్న లక్ష్యం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే గొప్ప వ్యాపారవేత్త
ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ను కొన్న తర్వాత దానిలో ఎన్నెన్ని మార్పులు చేశారో మనం చూశాం
ఆయన మరో సరికొత్త ప్రయోగాన్ని ట్విట్టర్ లో చేయబోతున్నారు
స్మార్ట్ టీవీల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్ లో స్మార్ట్ టీవీల సేల్స్ ఇంకా పెరుగుతాయి. అందుకే ఇప్పుడు ఇందులో గొప్ప బిజినెస్ ఆపర్చునిటీని ఎలాన్ మస్క్ చూస్తున్నారు. స్మార్ట్ టీవీల కోసం “ట్విట్టర్ వీడియో యాప్”ను తీసుకొచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ట్విట్టర్ వీడియో యాప్ రాబోతోంది అని స్వయంగా ఎలాన్ మస్క్ ప్రకటించారు. SM రాబిన్సన్ అనే నెటిజన్.. ట్విటర్ కు వీడియో యాప్(Twitter Video App) అవసరమని ట్విట్టర్ వేదికగా సూచించగా ఎలాన్ మస్క్ ఈ ఆన్సర్ ఇచ్చాడు. “మాకు నిజంగా స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ అవసరం. నాకు ట్విట్టర్‌లో గంట నిడివి గల వీడియోలు కనిపించడం లేదు” అని ఎలాన్ మస్క్ కు SM రాబిన్సన్ మెసేజ్ పెట్టాడు.
Also read : Twitter Content Creators : ట్విట్టర్ లో కంటెంట్ క్రియేటర్లకు రూ.41.22 కోట్లు
ట్విట్టర్ వీడియో యాప్ రాబోతోందని మస్క్ చెప్పగానే.. “మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. నేను యూట్యూబ్ కు అన్ సబ్ స్క్రైబ్ చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అని SM రాబిన్సన్ కామెంట్ పెట్టాడు. ట్విట్టర్ క్రియేటర్లు పెట్టే పోస్ట్ లలోని రిప్లై సెక్షన్ లో వచ్చే యాడ్స్ డబ్బులను క్రియేటర్లకే చెల్లిస్తామని ఇటీవల ట్విట్టర్ ప్రకటించింది. ఇందుకోసం రూ.41 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించినట్టు వెల్లడించింది. దీన్నిబట్టి ట్విట్టర్ కూడా యూట్యూబ్ తరహా బిజినెస్ స్ట్రాటజీని తయారు చేసుకుంటున్నదనే అంచనాలకు తావిస్తోంది.