ED Raids : జార్ఖండ్ ముఖ్యమంత్రి నివాసంలో ఈడీ సోదాలు
- By Prasad Published Date - 03:44 PM, Fri - 8 July 22

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. టెండర్ కుంభకోణం వ్యవహారంలో హేమంత్ సొరేన్ తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. రాజ్ మహల్, మీర్జా చౌక్, సాహెబ్ గంజ్, మెర్హత్ తదితర 18 ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోదాల సమయంలో పారా మిలిటరీ బలగాల సాయాన్ని ఈడీ అధికారులు తీసుకున్నారు.