West Bengal : పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీల ఈడి కస్టడీని
- Author : Prasad
Date : 03-08-2022 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీల ఈడి కస్టడీని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టు బుధవారం మరో రెండు రోజులు పొడిగించింది. వీరి కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించాలని ఈడి కోరగా, కోర్టు రెండు రోజులు పొడిగించింది. వీరిద్దరినీ ఆగస్టు 5న అదే కోర్టు ముందు హాజరుపరచనున్నారు. విచారణ సందర్భంగా పార్థా ఛటర్జీ దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని,ఆయన్ని మరికొంత కాలం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అర్పిత ముఖర్జీ నుంచి స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టాలని అందువల్ల ఆమె కస్టడీని పొడిగించడం అవసరమని అని న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పొడిగింపు కోసం ఈడీ చేసిన అభ్యర్థనను పార్థా ఛటర్జీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు, తన క్లయింట్ శారీరకంగా అనారోగ్యంతో ఉన్నారని, అందువల్ల ఆరోగ్య కారణాలపై బెయిల్ మంజూరు చేయాలని పేర్కొన్నారు.