Panama: పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్యరాయ్ కు ఈడి నోటీసులు
పనామా పేపర్స్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు ఈడి సమన్లు జారీ చేయగా సోమవారం ఆమె విచారణకు హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
- By hashtagu Published Date - 11:48 AM, Mon - 20 December 21
పనామా పేపర్స్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు ఈడి సమన్లు జారీ చేయగా సోమవారం ఆమె విచారణకు హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నేడు (డిసెంబర్ 20) ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో భాగంగా నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేయగా అధికారుల ముందు హాజరయ్యారు.ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.