TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు
- By Balu J Published Date - 02:02 PM, Thu - 19 October 23

TS Polls: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్టులు, 12 ఇతర విభాగాల ఉద్యోగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఎఫ్ సీఐ, ఎఎఐ, పీఐబీ, హెయిర్, విద్యుత్ శాఖ, రైల్వే, వైద్యరోగ్య శాఖ, హెయిర్ RTC, పౌరసరాఫరాల శాఖ, బీఎస్ యన్ఎల్, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. వీరంతా నవంబర్ 7వ తేదీలోగా ఫారం-12Dకి దరఖాస్తు చేయాలి. కాగా, కొత్తఓటర్లకు నెలాఖరు నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ జరగనుంది.
ఈఏడాది రెండు విడతలుగా ఓటర్ల జాబితా ప్రకటించారు. 2023 జనవరి నుంచి కొత్తగా 40 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జనవరి1 నుంచి 27 లక్షలా 50 వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాలకే పంపిచారు. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి సంబంధించిన గుర్తింపు కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు. మిగిలిన వారి కార్డుల ముద్రణ పూర్తిచేసి పంపిణీ చేయనున్నారు.