Eastern Railway RRC ER: రైల్వే రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అర్హులు వీరే..!
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు (కనీసం 50 శాతం మార్కులతో) ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు సంబంధిత ట్రేడ్‌లో కూడా ITI కలిగి ఉండాలి.
- By Gopichand Published Date - 01:48 PM, Wed - 11 September 24

Eastern Railway RRC ER: రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తూర్పు రైల్వే అప్రెంటిస్ పోస్టుల కోసం అప్లికేషన్స్ ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Eastern Railway RRC ER) తూర్పు రైల్వే 3115 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు RRC ER అధికారిక వెబ్‌సైట్, rrcer.orgని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..?
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు (కనీసం 50 శాతం మార్కులతో) ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు సంబంధిత ట్రేడ్‌లో కూడా ITI కలిగి ఉండాలి. ఇకపోతే వయోపరిమితి గురించి మాట్లాడినట్లయితే.. అభ్యర్థి వయస్సు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read: Malaika Arora : అనుమానాస్పద స్థితిలో మలైకా అరోరా తండ్రి సూసైడ్
దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి..?
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
స్టైఫండ్ ఎంత ఉంటుంది..?
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా తూర్పు రైల్వే జోన్‌లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..!
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఐటీఐలో అభ్యర్థి సాధించిన మార్కులను జోడించి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. దీని తర్వాత అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.