Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు
ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం (Delhi Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది.
- By Gopichand Published Date - 03:37 PM, Tue - 3 October 23

Delhi Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం (Delhi Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిన మధ్యాహ్నం 2:53కి వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా భూకంపం సంభవించింది. ఢిల్లీలో భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉంది. దీని లోతు భూమి ఉపరితలం నుండి 5 కి.మీ ఉంది. భూకంపంతో ప్రజలు భయాందోళనలతో కార్యాలయాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read: AP : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..రేపు పెడన సభలో రాళ్ల దాడికి జగన్ కుట్ర..
We’re now on WhatsApp. Click to Join
శ్రావస్తిలో 2:51 గంటలకు భూకంపం సంభవించింది. రెండుసార్లు బలమైన ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్‌లలో కూడా భూకంపం సంభవించింది.