Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదు..!
హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. హిమాచల్‌లోని లాహౌల్, స్పితిలో భూకంపం సంభవించింది.
- By Gopichand Published Date - 07:22 AM, Thu - 10 August 23

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. హిమాచల్‌లోని లాహౌల్, స్పితిలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం అర్థరాత్రి సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. స్వల్ప భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
భూకంపాలు ఎందుకు వస్తాయి..?
భూకంపాలు రావటానికి శాస్త్రపరమైన కారణాలే గాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టాలు కూడా కారణమవుతున్నాయి. పెద్ద రిజర్వాయర్లలో నిల్వ వుంచిన నీటివల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేయడం ద్వారా, చెట్లను నరకడం వంటి చర్యలతో భూకంపాలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
Also Read: Ultra Rich Buying: దేశంలోని ధనవంతులు ఏ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారో తెలుసా..?
భూమి లోపల అనేక పొరలుంటాయి. ఒకపొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉండినట్లయితే, ఆ పొరను క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని క్రింద పొరను మాంటక్ అని పిలుస్తారు. దాని మందం మూడువేల కిలో మీటర్లు వుంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రత 8000 డిగ్రీల సెల్సియస్. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్, క్రెస్ట్‌లను ఛేదించుకొని బయటకు రావటం కొన్ని చోట్ల జరుగుతూ వుంటుంది.
భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.