HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Drones With A Range Of Up To 25 Kilometers Can Be Exported

Drone Without License : ఆ డ్రోన్ల తయారీ, ఎగుమతికి లైసెన్స్ అక్కర్లేదు

Drone Without License : పౌరులు ఉపయోగించే డ్రోన్ల ఎగుమతి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. 25 కిలోమీటర్లలోపు రేంజ్ కలిగిన డ్రోన్లను లైసెన్స్ లేకుండా ఎగుమతి చేయడంతో పాటు తయారు చేయొచ్చని ప్రకటించింది. 

  • Author : Pasha Date : 26-06-2023 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drone School
Drone School

Drone Without License : పౌరులు ఉపయోగించే డ్రోన్ల ఎగుమతి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది.

వ్యాపార, వైద్య, సినిమా, టూరిజం రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 

25 కిలోమీటర్లలోపు రేంజ్ కలిగిన డ్రోన్లను లైసెన్స్ లేకుండా ఎగుమతి చేయడంతో పాటు తయారు చేయొచ్చని ప్రకటించింది. 

ఈ నిర్ణయంతో దేశంలో డ్రోన్ల తయారీకి ప్రోత్సాహం లభించనుంది. ఫలితంగా వాటి ఉత్పత్తి పెరిగి, తక్కువ రేట్లకే అందుబాటులోకి వస్తాయి. 

పౌరులు ఉపయోగించే డ్రోన్లు ఇదివరకు కేంద్ర ప్రభుత్వం యొక్క ‘స్పెషల్ కెమికల్ ఆర్గానిజమ్స్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ’ లిస్టులో ఉండేవి. ఇప్పుడు వాటిని ఆ  జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దేశంలో డ్రోన్ల తయారీని ప్రోత్సహిస్తూనే, పౌరులు వినియోగించే డ్రోన్ల ఎగుమతిపై ఉన్న పరిమితులను సడలించామని పేర్కొంటూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. 2030 నాటికి భారత్‌ను డ్రోన్‌ల తయారీ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. పౌరులు వాడే 25 కిలోమీటర్ల లోపు రేంజ్ కలిగిన డ్రోన్‌లు, మానవరహిత వైమానిక వాహనాలు  (UAV) ‘జనరల్’ కేటగిరి కింద  ఎగుమతికి  అనుమతించబడుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తెలిపింది. వాటి ఎగుమతికి ఇక SCOMET లైసెన్స్ అవసరం లేదని(Drone Without License) పేర్కొంది.

Also read : Russia Private Army : రష్యా ప్రైవేటు సైన్యాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా ?  

Drones

ఇండియా నుంచి 100 దేశాలకు 10వేల డ్రోన్లు

గరుడ ఏరోస్పేస్ డ్రోన్ల తయారీ కంపెనీ. ఇది రూ.180 కోట్లను సమీకరించింది. కేంద్ర సర్కారు మార్చిన నిబంధనలు ఈ కంపెనీకి బాగా హెల్ప్ చేయనున్నాయి.  గరుడ ఏరోస్పేస్ కు  మలేషియా, యూఏఈ, పనామా సహా అనేక దేశాల నుంచి డ్రోన్ల కోసం బల్క్ ఆర్డర్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు 10,000 డ్రోన్‌లను ఎగుమతి చేయాలనే టార్గెట్ తో ఆ కంపెనీ ఉంది.

Ideaforge Technology కంపెనీ IPOకు జాక్ పాట్

దేశంలోని అతిపెద్ద డ్రోన్ తయారీ సంస్థ Ideaforge Technology షేర్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఫలితంగా ఈ కంపెనీ IPO ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది. IdeaForge కంపెనీ  IPO ఈరోజే (జూన్ 26న) ప్రారంభమవుతుంది. దీని షేర్లు జూలై 7న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో లిస్ట్ అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 25 kilometers
  • business
  • drone export
  • Drone Without License
  • Government Rules
  • Manufacturing

Related News

Solar Capacity For AC

ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

    Latest News

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

    • kothavalasa : ఉపాధి హామీ పనులు చేస్తుండగా బాంబు బ్లాస్ట్..పలువురికి గాయాలు

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    Trending News

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd