Dr. BS Rao : బాత్రూంలో జారిపడి… శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూత!
బీఎస్ రావు (BS Rao) అనారోగ్యంతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.
- By Maheswara Rao Nadella Published Date - 04:58 PM, Thu - 13 July 23

Dr. BS Rao passed away : తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థ అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. బీఎస్ రావు అనారోగ్యంతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని ఈ సాయంత్రం విజయవాడకు తరలించనున్నారు. అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు.
డాక్టర్ బీఎస్ రావు (Dr. BS Rao) పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు డాక్టర్ బీఎస్ రావు మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభం. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చిన ఘనత ఆయనది . డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.
Also Read: AP Politics: వైసీపీలో వర్గపోరు.. జగన్ కు షాక్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే