Gangula Kamalakar: నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
- By Balu J Published Date - 06:11 PM, Thu - 17 August 23
Gangula Kamalakar: నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు అని వార్తలను ఖండించారు. గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటణలో గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని పేర్కొన్నారు.
Also Read: Tirumala Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీ..శ్రీవారితో పాటు ఇతర పుణ్యక్షేత్రాలనూ చూడొచ్చు!