Steel Glass In Stomach: వామ్మో అతని కడుపులో స్టీల్ గ్లాస్.. అసలు ఎలా వెళ్లిందంటే?
సాధారణంగా మనకు కొన్ని కొన్ని సార్లు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అయితే మరి కొన్నిసార్లు ఈ కడుపునొప్పి తీవ్రం
- Author : Anshu
Date : 07-08-2022 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా మనకు కొన్ని కొన్ని సార్లు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అయితే మరి కొన్నిసార్లు ఈ కడుపునొప్పి తీవ్రం అవడంతో కొందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల, లేదంటే కడప ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కడుపునొప్పి వస్తుంది అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్ళగా అతని కడుపుకీ స్కానింగ్ చేసి చూసిన డాక్టర్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆ వ్యక్తి కడుపులో ఏకంగా స్టీల్ గ్లాసు ఉందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లా గోత్వా భతౌలి గ్రామానికి చెందిన సమర్నాథ్ అనే వ్యక్తి కథ కొన్నేళ్లుగా హెర్నియాతో బాధపడుతున్నాడు.
దీని కారణంగా అతడు కొద్దిరోజులుగా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేకపోతున్నాను. ఈ క్రమంలోని ఇటీవలే కడుపునొప్పి మరింత తీవ్రం అవ్వడంతో జౌన్ పూర్ లోని ఒక ఆస్పత్రికీ వెళ్లాడు. అక్కడి వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్రే తీశారు.ఎక్స్ రే రిపోర్టు చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి కడుపులో ఒక పెద్ద స్టీల్ గ్లాస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే కడుపులో ఉన్న స్టీల్ గ్లాసును మలద్వారం ద్వారా బయట తీసే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో, వెంటనే సర్జరీ చేసి అతని కడుపులోనుంచి స్టీల్ గ్లాస్ ను బయటకు తీశారు.
అయితే సమర్ నాథ్ కు సర్జరీ చేసిన డాక్టర్ లాల్ బహదూర్ మాట్లాడుతూ.. అసలు స్టీల్ గ్లాస్ అతని కడుపులోకి ఎలా వెళ్ళిందని డాక్టర్ అడగగా అప్పుడు సమర్నాథ్ ఏవేవో సమాధానాలు చెప్పాడట. కానీ అవి నమ్మశక్యంగా అనిపించడం లేదని. ఆ స్టీల్ గ్లాస్ కడుపులోకి మలద్వారనే వెళ్లి ఉండవచ్చు అని భావిస్తున్నాము అని చెప్పుకొచ్చారు.