ఈ కల్లు ఒక సీసా ధర రూ. 500.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
- By Anshu Published Date - 03:36 PM, Wed - 8 June 22

సాధారణంగా మనం తాగే కల్లు ధర వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉంటుంది. ఇంకా కొన్ని విదేశాలలో అయితే తక్కువ ధరకు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కల్లు మాత్రం చాలా ఖరీదైనది. ఆ కల్లు ఒక సీసా ఖరీదు దాదాపుగా 500 రూపాయలు. అది కూడా ముందు రోజే బుక్ చేసుకుంటేనే దొరుకుతుందట. మరి ఆ కల్లు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోని సూర్యాపేటకు సమీపంలోని కాసరబాదలో ఈ కల్లు లభిస్తుంది. అయితే ఈ ప్రదేశంలో దొరికే కల్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోవడంతో పాటు షుగర్ కూడా తగ్గిపోతుందట. కాసరబాద కు చెందిన సైదులు అనే వ్యక్తి సుమారు 15 ఏళ్ళ కిందట జీలుగ చెట్ల కల్లు తీయడం కోసం చత్తీస్గడ్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో వాటి విత్తనాలు తీసుకొని వచ్చి అక్కడ నాటడట. అలా ఆ గ్రామంలో ఆ చెట్లకు మూడేళ్ల నుంచి కల్లు కారుతోందట. దీంతో జనం ఆ కల్లు తాగడం కోసం ఎగబడుతున్నారు. ఒక బాటిల్ దాదాపుగా 500 కాగా అది కూడా ముందు రోజు ఆర్డర్ ఇస్తే లభిస్తుందట.