Medaram: వనదేవతలను దర్శించుకున్న డీజేపీ రవిగుప్తా, పోలీస్ అధికారులు
- By Balu J Published Date - 11:03 PM, Mon - 19 February 24

తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త, అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ బి శివధర్ రెడ్డి లు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారళమ్మ జాతర సందర్శించి వనదేవతలకు సోమవారం నాడు మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ…. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని రెండు కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోవు నాలుగు రోజులు జాతర నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. సిబ్బందికి డ్యూటీ పాయింట్ల వద్ద సరైన అవగాహన కల్పించాలని తెలియజేశారు.
ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ జాతర నిర్వహణలో ప్రథమ స్థానం కలిగి ఉంటుందని దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రింది స్థాయి సిబ్బందికి అధికారులు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ బి.శివధర్ రెడ్డి , ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ ఎస్ పి గౌష్ ఆలం , తదితర అధికారులు పాల్గొన్నారు.