Missing: నెల్లూరులో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం
నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ముగ్గురు బాలికలు అదృశ్యం (Missing) కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యాకసిరి అంకిత, మల్లికా జ్యోతి, నాగమణి అనే బాలికలు గత రాత్రి ఏడు గంటల నుంచి కనిపించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
- By Gopichand Published Date - 12:46 PM, Tue - 24 January 23

నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ముగ్గురు బాలికలు అదృశ్యం (Missing) కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యాకసిరి అంకిత, మల్లికా జ్యోతి, నాగమణి అనే బాలికలు గత రాత్రి ఏడు గంటల నుంచి కనిపించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే రావూరు గురుకుల పాఠశాలలో గతంలో కూడా బాలికలు అనేకసార్లు తప్పిపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇదే పాఠశాలలో చదివే బాలికలు అనేక సార్లు తప్పిపోయారు.
Also Read: Jagan-CBN : జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు
సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి గురుకుల పాఠశాలలో చదివే పదోవ తరగతి విద్యార్థులు యాకసిరి అంకిత, మల్లికా జ్యోతి, నాగమణి అనే ముగ్గురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.