ACB: ఫోన్ రాగానే రంగంలోకి దిగుతున్న ఏసీబీ
టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ రాగానే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగిపోతున్నారు.
- By Hashtag U Published Date - 10:08 AM, Wed - 9 February 22

టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ రాగానే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగిపోతున్నారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచాలు తీసుకుంటున్నారని బాధితుల ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రెండేళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.
బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లోనే యాక్షన్‌లోకి దిగిపోతోంది. ఫిర్యాదుల తీరును బట్టి తగిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలితే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏసీబీ ‘స్పందన’ వ్యవస్థను నేడు విజయవంతంగా నిర్వహిస్తోంది. బాధితుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడంపై ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ 14400 కేటాయించింది. బాధితులు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే విజయవాడలోని ఏసీబీ ప్రధాన కా ర్యాలయానికి వెంటనే సమాచారమిస్తారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆరోపణల తీరును బట్టి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తున్నారు. సాధారణ ఫిర్యాదులైతే 10 రోజులు, లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఫిర్యాదులైతే నెల రోజుల్లో పరిష్కరించాలన్నది గడువులోపే 2రోజుల్లోనే రంగంలోకి దిగుతున్న అధికారులు.