Yamuna Floods: ఉప్పొంగిన యమునా.. కేంద్ర జల సంఘం హెచ్చరికలు
గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నది
- By Praveen Aluthuru Published Date - 09:30 AM, Mon - 24 July 23

Yamuna Floods: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నది. మరీ ముఖ్యంగా అక్కడ యమునా నాదీ ఉండటంతో ప్రమాదం అంచుకు చేరుతుంది. యమునా నది మరోసారి ఉప్పొంగింది. యమునా నీటిమట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) దాటింది. యమునా నది నీటిమట్టం పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. పాత రైల్వే వంతెన సమీపంలో రాత్రి 7 గంటలకు యమునా నీటిమట్టం 206.37 మీటర్లకు పెరిగింది. అదే సమయంలో పాత యమునా వంతెనపై సోమవారం ఏడు గంటలకు యమునా నది నీటిమట్టం 206.56 మీటర్లుగా నమోదైంది. దీంతో ప్రస్తుతం పాత ఇనుప వంతెనపై నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవడంతో కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.
యమునా ఉదృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఈ మేరకు అమిత్ షా ట్వీట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి తగిన సంఖ్యలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.
Also Read: Gyanvapi Mosque-Survey Begins : జ్ఞానవాపి మసీదులో మొదలైన ఏఎస్ఐ సర్వే