Gyanvapi Mosque-Survey Begins : జ్ఞానవాపి మసీదులో మొదలైన ఏఎస్ఐ సర్వే
Gyanvapi Mosque-Survey Begins : ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) టీమ్ సైంటిఫిక్ సర్వేను మొదలుపెట్టింది.
- Author : Pasha
Date : 24-07-2023 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
Gyanvapi Mosque-Survey Begins : ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) టీమ్ సైంటిఫిక్ సర్వేను మొదలుపెట్టింది. సోమవారం ఉదయం 7 గంటలకు న్యాయ వాదులతో కలిసి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళింది. ASI అధికారులు, నిపుణులు ఆధునిక యంత్రాలను తమతో పాటు మసీదులోకి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో వారణాసి నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది. హిందూ ఆలయంపై జ్ఞానవాపి మసీదును నిర్మించారా లేదా అనేది సైంటిఫిక్ సర్వే ద్వారా తేల్చాలని జూలై 21న వారణాసి జిల్లా జడ్జి డా.అజయ్ కృష్ణ విశ్వేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ సర్వే(Gyanvapi Mosque-Survey Begins) జరుగుతోంది.
Also read : Clear No Ball: సాయి సుదర్శన్ వికెట్ వివాదం.. బ్యాడ్ అంపైరింగ్
ఈ మసీదులో ఇప్పటికే సీల్ చేసిన వుజూ ఖానా మినహా మసీదులోని మిగితా మొత్తం భాగాన్ని సర్వే చేయాలని జిల్లా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మసీదుకు సంబంధించిన సైంటిఫిక్ సర్వే రిపోర్టును ఆగస్టు 4లోగా సమర్పించాలని నిర్దేశించింది. ఈ సర్వేలో సహకరించాలని హిందూ పక్షం వాదిస్తోంది. అయితే జిల్లా జడ్జి ఆదేశాలను సుప్రీం కోర్టులో తాము సవాల్ చేశామని, ఈ సర్వే తేదీని పొడిగించాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ డిమాండ్ చేసింది.
Also read : Terror Attacks: పాకిస్థాన్ లో పెరుగుతున్న తీవ్రవాద ఘటనలు.. ఏడాది కాలంలోనే 665 ఉగ్రవాద దాడులు..!