Manish Sisodia: మనీష్ సిసోడియాను మెడ పట్టుకు లాకేళ్లిన పోలీసులు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై పోలీసులు దురుసు ప్రవర్తనపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. మాజీ ఉపముఖ్యమంత్రిని పోలీసులు మెడ పట్టుకుని లాక్కెళ్లినట్లు ఆప్ ఆరోపిస్తుంది
- By Praveen Aluthuru Published Date - 05:15 PM, Tue - 23 May 23

Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై పోలీసులు దురుసు ప్రవర్తనపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. మాజీ ఉపముఖ్యమంత్రిని పోలీసులు మెడ పట్టుకుని లాక్కెళ్లినట్లు ఆప్ ఆరోపిస్తుంది. ఈ మేరకు సదరు వీడియో రిలీజ్ చేస్తూ బీజేపీపై మండి పడింది ఆమ్ ఆద్మీ పార్టీ. .
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీ నేటితో ముగిసింది. ఈ క్రమంలో సిసోడియాను కోర్టులో హాజరు పరిచి బయటకు తీసుకువస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగిందంటే… సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచి బయటకు తీసుకువస్తున్న తరుణంలో మీడియా చుట్టుముట్టింది. ఈ సమయంలో ఓ విలేఖరి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ప్రశ్నించారు. దీనికి సిసోడియా స్పందిస్తూ.. ప్రజాస్వామ్యం అంటే మోడీకి గౌరవం లేదని, ఆయన ఒక అహంకారి అంటూ విమర్శించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో మనీష్ సిసోడియాను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తరలించే క్రమంలో ఆయన మెడపై చేయి వేసి లాక్కెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఒక మాజీ డిప్యూటీ సీఎంని అలా లాకెళ్లడానికి పోలీసులకు హక్కు ఎవరిచ్చారంటూ మండిపడుతున్నారు. ఇలా చేయమని ఎవరైనా చెప్పారా అంటూ బీజేపీని ఉద్దేశించి మండిపడుతున్నారు.
Shocking misbehaviour by this policeman with Manish ji in Rouse Avenue Court. Delhi police should suspend him immediately. pic.twitter.com/q9EU0iGkPL
— Atishi (@AtishiAAP) May 23, 2023
మనీష్ సిసోడియా ఘటనపై ఆప్ కామెంట్స్ కి ఢిల్లీ పోలీస్ స్పందించింది. అక్కడ పరిస్థితి అదుపు తప్పిందని, ఆయనకు భద్రత కల్పించేందుకే బలవంతంగా తరలించాల్సి వచ్చిందని ఢిల్లీ పోలీస్ ట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కాగా నేడు మనీష్ సిసోడియాను కోర్టులో హాజరు పర్చగా.. జూన్ 1 వరకు జ్యూడిషియల్ కష్టడీలోనే ఉండాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.
Read More: Price Hike : జూన్ 1 బ్యాడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు “ఫేమ్” కట్

Related News

Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు .. లైంగిక కేసులో కీలక మలుపు
రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టుకు సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు ప్రకటించాయి