Delhi Liquor Scam: ఈడీ కస్టడీకి ఆప్ ఎంపీ.. కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపింది.
- By Praveen Aluthuru Published Date - 08:13 PM, Thu - 5 October 23

Delhi Liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపింది. ఢిల్లీ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సింగ్‌ను అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీకి పంపారు. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంజయ్ సింగ్ కుటుంబ సభ్యులను, ఆయన భార్యను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. బీజేపీ నిజాయితీ లేదని, అక్రమ కేసులతో నాయకుల్ని, ప్రజలను బలవంతంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమది నిజాయితీ గల పార్టీ అని, అందుకే సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు. మనం కూడా అవినీతికి పాల్పడితే మన సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ తర్వాత ఇప్పుడు 51 ఏళ్ల సంజయ్ సింగ్‌ను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ మరియు బిజెపి మధ్య రాజకీయ విబేధాలు మొదలయ్యాయి. మనీష్ సిసోడియా సహా 15 మందిపై గతేడాది ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను వేరే మనీలాండరింగ్ కేసులో మే 30, 2022న ఈడీ అరెస్టు చేసింది.
Also Read: Rathinirvedam Re Release : శృంగారభరిత ప్రియుల ‘రతి నిర్వేదం’ రీ రిలీజ్