Rathinirvedam Re Release : శృంగారభరిత ప్రియుల ‘రతి నిర్వేదం’ రీ రిలీజ్
డైరెక్టర్ టి.కె.రాజీవ్ కుమార్ డైరెక్ట్ గా శ్వేతా మీనన్ , శ్రీజిత్ విజయ్ కీలక పాత్రధారులుగా నటించారు
- Author : Sudheer
Date : 05-10-2023 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
రతి నిర్వేదం (Rathinirvedam ) ఈ సినిమా గురించి యూత్ కు ముఖ్యంగా శృంగార ప్రియులకు చెప్పాలిన పనిలేదు. శ్వేతా మీనన్ (Shweta Menon) ప్రధాన పాత్రలో 2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సీన్లు యూట్యూబ్ లో , ఆన్లైన్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరింపచేసేందుకు సిద్ధమైంది.
We’re now on WhatsApp. Click to Join.
మలయాళం లో సూపర్ హిట్ అయిన “రతి నిర్వేదం” సినిమాని ఎస్.వి.ఆర్ మీడియా వారు అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. 1970లో భరతన్ అనే రచయత రాసిన నవల “రతి నిర్వేదం” ఆధారంగా 1978లో నిర్మించబడింది. అదే టైటిల్ తో 2011 లో రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ టి.కె.రాజీవ్ కుమార్ డైరెక్ట్ గా శ్వేతా మీనన్ , శ్రీజిత్ విజయ్ కీలక పాత్రధారులుగా నటించారు. అలా మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 11 న (October 11) రీ రిలీజ్ కాబోతుంది. ఈ రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గరి నుండి సినీ లవర్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Read Also : World Cup 2023: మెగా టోర్నీకి క్యూ కట్టిన స్పాన్సర్లు