DC vs PBKS Report: చెలరేగిన బౌలర్లు…ఢిల్లీ గ్రాండ్ విక్టరీ
జట్టులో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకి దూరమైనా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ అదరగొట్టింది.
- Author : Naresh Kumar
Date : 20-04-2022 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
జట్టులో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకి దూరమైనా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ అదరగొట్టింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగిన వేళ 9 వికెట్లతో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ జితేశ్ శర్మ 23 బంతుల్లో 5 ఫోర్లు 32, మయాంక్ అగర్వాల్ 15 బంతుల్లో 4 ఫోర్లతో 24 టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
చిన్న టార్గెట్ అయినప్పటికీ తొలి బంతి నుంచే ఢిల్లీ ఓపెనర్లు రెచ్చిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి 57 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 60 నాటౌట్, పృథ్వీ షా20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41 విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఈ ఇద్దరి ధాటైన బ్యాటింగ్‌కు ఢిల్లీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. పృథ్వీ షా ఔటైన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వార్నర్ ధాటిగా ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో నాథన్ ఎల్లిస్ వేసిన 10వ ఓవర్‌లో బౌండరీ బాది 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
What a way to return to winning ways! 👏 👏@DelhiCapitals put up a dominant show & sealed a clinical 9⃣-wicket win over #PBKS. 👌 👌
Scorecard ▶️ https://t.co/3MYNGBm7Dg#TATAIPL | #DCvPBKS pic.twitter.com/6YpYU4bh18
— IndianPremierLeague (@IPL) April 20, 2022