HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Aap Councilor Sunita Joins Bjp

Delhi Politics: ఢిల్లీలో చక్రం తిప్పిన బీజేపీ.. ఆప్ వికెట్ డౌన్

ఢిల్లీలో రాబోయే రోజుల్లో మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ ఆప్ కు షాక్ ఇస్తూ కౌన్సలర్ ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యారు

  • Author : Vamsi Chowdary Korata Date : 24-04-2023 - 1:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi Politics
Delhi Politics

Delhi Politics: ఢిల్లీలో రాబోయే రోజుల్లో మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ ఆప్ కు షాక్ ఇస్తూ కౌన్సలర్ ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యారు. మేయర్ ఎన్నికల సమయంలో ఇలా జరగడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ద్వారకా సి వార్డు కౌన్సిలర్ సునీత మరియు ఆమె భర్త మాజీ కౌన్సిలర్ రాంనివాస్ పహల్వాన్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ దంపతులకు సాదర స్వాగతం పలికారు.

రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది కౌన్సిలర్లు ఆప్‌ని వీడి బీజేపీలో చేరతారని పర్వేశ్ వర్మ పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 107కి చేరింది. సునీత, ఆమె భర్త గతంలో బీజేపీలో ఉన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు ఇద్దరూ ఆప్‌లో చేరారు. వీరిద్దరూ సోమవారం తిరిగి బీజేపీలోకి వచ్చారు.

ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ స్కాం, ఇతర అవినీతి ఆరోపణలపై బీజేపీ న్యాయ పోరాటం చేస్తున్నాదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సచ్‌దేవా అన్నారు. ఇక్కడ కార్మికుల సూచనల మేరకు పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆప్‌లోని కార్యకర్తలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రభావితమై ప్రజలు బీజేపీలో చేరుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కౌన్సలర్ మాట్లాడుతూ… రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ నుంచి వచ్చిన సంస్కృతి వల్లే తమ కుటుంబం సమాజం కోసం పనిచేస్తోందని అన్నారు. మొదటి నుంచి బీజేపీతో అనుబంధం ఉన్న ఆమె కొన్ని కారణాల వల్ల ఆప్‌లోకి మారారు. గతంలో కంటే అంకితభావంతో పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు సునీత.

Read More: TDP : చంద్ర‌బాబు ఆయుధాలు కోడిక‌త్తి,వివేకా హ‌త్య


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • AAP councilor
  • bjp
  • Delhi Live Updates
  • Delhi Mayor Polls
  • delhi politics
  • Sunitha

Related News

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd