Final Written Examinations: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఇవే..!
పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి TSLPRB కీలక ప్రకటన చేసింది. మార్చి 12, 2023 నుండి తుది పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది.
- By Gopichand Published Date - 12:06 PM, Sun - 1 January 23

పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి TSLPRB కీలక ప్రకటన చేసింది. మార్చి 12, 2023 నుండి తుది పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 10 నుండి 1 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుండి సా.5.30 వరకు పేపర్-2 ఉంటుందని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం http://tslprb.in వెబ్ సైట్ ను చూడవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేహధారుడ్య పరీక్షల్లో పాల్గొని క్లియర్ చేసిన వాళ్లే.. మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు.