Dalit Sisters Gang Raped: అయోధ్యలో దారుణం.. దళిత అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత అక్కాచెల్లిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
- By Balu J Published Date - 02:05 PM, Thu - 11 August 22

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత అక్కాచెల్లిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఒకరైన మైనర్‌ని వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. బికాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ గ్రామానికి సమీపంలోని షెర్పూర్‌పురా మార్కెట్ నుండి సిస్టర్స్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు యువకులు చెరకు తోటలోకి తీసుకెళ్లిన తర్వాత సామూహిక అత్యాచారం జరిపారు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితులను బెదిరించి పారిపోయారు. నిందితుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు బికాపూర్ సర్కిల్ అధికారి ప్రమోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ఒకరోజు తర్వాత దళిత అమ్మాయిలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు పోలీసులు.
మొదట్లో స్థానిక పోలీసులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత కొంతమంది సీనియర్ పోలీసు అధికారుల జోక్యంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బాధితురాలి తండ్రి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి 376-డి (గ్యాంగ్ రేప్), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (అవమానకరమైనది) 506 (నేరపూరిత బెదిరింపు) కింద లాల్ యాదవ్, త్రిభువన్ యాదవ్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కింద అభియోగాలు మోపినట్లు సర్కిల్ అధికారి తెలిపారు.