Cyclone Asani: ఉత్తర ఈశాన్య దిశగా కదులుతున్న అసని తుఫాను
ఏపీలో అసని తుఫాను ప్రభావం కొనసాగుతుంది.
- Author : Hashtag U
Date : 12-05-2022 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో అసని తుఫాను ప్రభావం కొనసాగుతుంది. నిన్న(బుధవారం) రాత్రి మచిలీపట్నం నర్సాపురం వద్ద తీరం దాటిన అసని తుఫాను తాజాగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది. ఈ రోజు (గురువారం) ఉదయానికి నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖ జిల్లా మీదుగా పయనిస్తుంది. తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అసని తుఫాను దాటికి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో వందల ఎకరాల్లోని అరటి, మొక్కజొన్న, బొప్పాయి, మామిడి పంటలు ధ్వంసం అయ్యాయి.