CSK Injuries: చెన్నైకి మరో షాక్
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది దారుణంగా విఫలమవుతోంది ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
- By Hashtag U Published Date - 10:04 AM, Tue - 19 April 22

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది దారుణంగా విఫలమవుతోంది ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
అయితే వరుస ఓటములతో బిక్కుబిక్కుమంటున్నకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే మెగా వేలంలో కోట్లు వెచ్చించి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమావగా, తాజాగా విదేశీ పేసర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా లీగ్ మధ్యలోనే వైదొలిగాడు.
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా కేకేఆర్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు గాయం బారిన పడ్డాడు. స్కానింగ్‌లో ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఆడమ్ మిల్నే ఐపీఎల్ 15వ సీజన్‌కు దూరమవుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ”మిస్ యూ ఆడమ్ మిల్నే.. మనువ్వు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే ఆడమ్ మిల్నే లాంటి స్టార్ పేసర్ దూరమవ్వడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సీఎస్‌కే తమ 7వ మ్యాచ్‌లో ఏప్రిల్ 21న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 మ్యాచుల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఎలాగైనా విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.